అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతున్న నేపథ్యంలో మణుగూరు ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యటించారు. ఆయనతో పాటు అశ్వాపురం సిఐ కూడా పాల్గొన్నారు.
ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి అశ్వాపురం, మొండికుంట, తుమ్మల చెరువు, గొందిగూడెం నామినేషన్ కేంద్రాలను వరుసగా సందర్శించి అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి,
ఎన్నికల సమయంలో చట్టం, శాంతి భద్రతను కచ్చితంగా కాపాడాలని,
నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని,
ప్రజలతో గౌరవంగా వ్యవహరిస్తూనే, సెక్యూరిటీ విషయంలో కఠినంగా ఉండాలని
స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా కొనసాగుతున్నదని, అవసరమైన అదనపు బందోబస్తు కూడా సిద్ధంగా ఉంచినట్లు ఎస్డిపిఓ తెలిపారు.
అశ్వాపురం మండలంలో ఈసారి నామినేషన్ ప్రక్రియలో పోలీసులు అప్రమత్తంగా పనిచేస్తున్నారని స్థానికులు అభినందిస్తున్నారు.









