మండలంలో రెచ్చిపోతున్న కాపర్ దొంగలు — రైతులు, ప్రజల్లో ఆందోళన.
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ :
కరకగూడెం మండలంలో కాపర్ దొంగల దందా మళ్లీ ఊపందుకుంది. రేగళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దులగూడెం ప్రాంతంలో జరిగిన దొంగతనం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.
కొమరం సూరి పామయిలు తోటలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని దొంగలు పగలగొట్టి, అందులోని కాపర్ వైర్‌ను పూర్తిగా ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో తోటకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Post Views: 28









