ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నకిలీ లేడీ కానిస్టేబుల్ కథకం వెలుగులోకి ఖాకీపై మోజుతో యువతి సాహసం… అధికారులకు షాక్

నకిలీ లేడీ కానిస్టేబుల్ కథకం వెలుగులోకి
ఖాకీపై మోజుతో యువతి సాహసం… అధికారులకు షాక్
మేడ్చల్,ఆధాబ్ న్యూస్:
మేడ్చల్ జిల్లా నివాసి ఉమాభారతి (21) అనే యువతి చేసిన సాహసం చివరికి పోలీసుల దృష్టికి ఎక్కింది. పోలీస్ ఉద్యోగం రాకపోయినా ఖాకీ డ్రెస్‌పై మోజు పెంచుకున్న ఆమె… నకిలీ లేడీ కానిస్టేబుల్‌గా వ్యవహరించడం కలకలం రేపింది.

సచివాలయం, వీఐపీ మీటింగులు, ఖైరతాబాద్ గణేష్ బందోబస్తు వరకు వెళ్లి విధులు నిర్వర్తించినట్లు విచారణలో వెల్లడైంది. అసలు కానిస్టేబుల్‌గానే తిరుగుతున్న ఆమెపై నవంబర్ 21న సైబరాబాద్ సీపీ కార్యాలయంలో అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో నిజం బయటపడింది.

దీంతో మాదాపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి, కేసును మరింత విచారణ కోసం జీడిమెట్ల పోలీసులకు బదిలీ చేశారు. ఖాకీ డ్రెస్‌పై మోజు… యువతిని నేరపథంలోకి నెట్టిన ఘటనగా ఈ కేసు మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!