ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మీసేవ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు సేవల నాణ్యత, రుసుముల వసూళ్లపై అధికారులు సమగ్ర పరిశీలన.

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, కొత్తగూడెం
స్థానికంగా పనిచేస్తున్న మీసేవ కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించేందుకు గురువారం ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (TSTS) జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా అధికారులు కేంద్రాల నిర్వహణ, శుభ్రత, కంప్యూటర్ సదుపాయాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సిబ్బంది వ్యవహారం, అలాగే సేవల వేగం వంటి అంశాలను గమనించారు. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఆదాయ ధ్రువపత్రాలు, మౌలిక వృత్తి ధ్రువపత్రాలు, రేషన్ కార్డులు, జనన–మరణ ధ్రువపత్రాలు, పెన్షన్ దరఖాస్తులు వంటి సేవల ప్రాసెసింగ్‌పై కూడా సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రామాణిక రుసుములకే వసూలు చేయాలని మీసేవ ఆపరేటర్లకు అధికారులు స్పష్టం చేశారు. సేవల జాబితా, రుసుముల వివరాలు, సూచిక బోర్డులను కేంద్రంలో స్పష్టంగా ప్రదర్శించాలి అని ఆదేశించారు. అధిక రుసుములు వసూలు చేసే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసగించకూడదని, పారదర్శకతతో సేవలు అందించాలని సూచించిన అధికారులు, వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!