ప్రతి క్షణం
ప్రజల పక్షం

  శబరిమలకు వెళ్తున్నారా… తస్మాత్ జాగ్రత్త! భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరికలు – బ్రెయిన్ ఫీవర్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండండి

శబరిమలకు వెళ్తున్నారా… తస్మాత్ జాగ్రత్త!
భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరికలు – బ్రెయిన్ ఫీవర్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండండి
వెబ్ డెస్క్,ఆధాబ్ న్యూస్:
శబరిమల అయ్యప్ప దర్శన యాత్రకు వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు వేగంగా పెరుగుతుండటంతో యాత్రికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

నదిలో స్నానం సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి
భక్తులు పుణ్యస్నానం కోసం నదులు, వాగులు వెళ్లే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచించారు. అమీబా నీటిమార్గంగా శరీరంలోకి ప్రవేశించే అవకాశముండటంతో భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

శుభ్రత–హైజీన్ పాటించాలని సూచన

తాగడానికి వేడి నీటినే ఉపయోగించాలి

భోజనం చేయడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి

అపరిశుభ్రమైన నీటి వనరులను పూర్తిగా దూరం పెట్టాలని ఆరోగ్య శాఖ సూచించింది.

69 కేసులు – 19 మరణాలు
కేరళలో ఇప్పటివరకు మొత్తం 69 బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 19 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రికులు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

శబరిమలకు వెళ్లే భక్తులు ఆరోగ్య శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు పునరుద్ఘాటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!