ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అనంతారం గ్రామంలో దుఃఖ ఛాయలు… షేక్ బాబు పార్థివ దేహానికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు

అనంతారం గ్రామంలో దుఃఖ ఛాయలు… షేక్ బాబు పార్థివ దేహానికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన షేక్ బాబు అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారి నివాసానికి చేరుకున్నారు.

పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అత్తె నాగేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ అత్తె సత్యనారాయణ, మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్, పసునూరి అంజయ్య, పఠాన్ యకూబ్ ఖాన్, పాయం కృష్ణ, శంకరయ్య, చిత్తలూరు నరసయ్య, మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!