రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అవినీతి కేసులో డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా ఏసీబీకి హ్యాండెడ్‌గా చిక్కారు. రేషన్ షాపులో స్టాక్ లేనందుకు, అలాగే పనివేళ్లలో షాపు మూసివేసిన విషయంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రేషన్ షాపు యజమానితో రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ లావాదేవీకి మధ్యవర్తిగా డిలర్ల సంఘం అధ్యక్షుడిని ఉపయోగించిన డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ పాషా, గిరిజన సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్‌తో కలిసి లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేసి వారిని హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఘటనపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Post Views: 61









