చిరుమల్ల గ్రామంలో అనారోగ్యంతో యువకుడు మృతి దిక్కుతోచని స్థితిలో భార్య ఇద్దరు చిన్నారులు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం వట్టం వారి గుంపు పంచాయతీ పరిధిలోని చిరుమల్ల గ్రామానికి చెందిన మంచాల సంతోష్ (28) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గత పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్ మొదట భద్రాచలం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అత్యవసరంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించి సోమవారం తుదిశ్వాస విడిచారు.
మృతుడు రోజువారీ కూలీ పనులు, హమాలి పనులు చేస్తూ కుటుంబాన్ని అష్టకష్టాలతో నడిపిస్తున్నాడు. సంతోష్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు—అబ్బాయి ఆరు సంవత్సరాలు, అమ్మాయి మూడు సంవత్సరాలు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లలు,భార్య దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.









