సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్ : నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం కలిసి పలు ముఖ్యాంశాలపై చర్చించారు. ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు పాల్గొన్నారు.
సినీ పరిశ్రమను ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న పైరసీ విషయంలో ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, “సినిమా ఇండస్ట్రీకి పైరసీ వల్ల భారీ నష్టం జరిగింది. పైరసీ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందిన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పైరసీ మాస్టర్ మైండ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశాం. ఐబొమ్మపై గత కొన్ని నెలలుగా నిరంతర దర్యాప్తు కొనసాగించి, పైరసీని అరికట్టడానికి మా వంతు శ్రమ పెట్టాం. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం” అని వెల్లడించారు.
ప్రముఖుల ఈ భేటీతో పైరసీ నిర్మూలనకు మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.









