అశోక్ నగర్‌లో ఆటోలను ఢీకొట్టిన ప్రమాదం – ఒకరికి తీవ్ర గాయాలు
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
మణుగూరు అశోక్‌నగర్ ప్రాంతంలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కూలీలతో వెళుతున్న ఒక ఆటోను మరో ప్యాసింజర్ ఆటో ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
సమాచారం ప్రకారం, పినపాక మండలం భూపాలపట్నం నుండి గొందిగూడెం దిశగా కూలీలను తీసుకుని వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ప్యాసింజర్ ఆటో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు తీవ్రంగా గాయపడగా, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కూడలి గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 42









