వీధి కుక్కల దాడిలో చూపు కోల్పోయిన మూడేళ్ల చిన్నారి
రంగారెడ్డి, ఆధాబ్ న్యూస్:
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాల నుండి ఇంటికి వస్తున్న జ్యోతి, జనార్దన్ దంపతుల కుమారుడు రిత్విక్ (3)పై వీధి కుక్కలు దాడి చేశాయి.
ఈ దాడిలో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అతన్ని అత్యవసరంగా హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడి ఎడమ కంటిలో చూపు పూర్తిగా కోల్పోయినట్టు నిర్ధారించారు.
తమ చిన్నారి చూపు కోల్పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వీధి కుక్కల ఉనికి పెరుగుతోందని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 47









