కరకగూడెం మండల అయ్యప్ప ట్రస్టు అధ్యక్షుడిగా సిరిశెట్టి కమలాకర్ ఏకగ్రీవ ఎన్నిక
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం కరకగూడెం మండల అధ్యక్ష ఎన్నిక జరిగింది. మండలానికి చెందిన వివిధ గ్రామాల నుండి వచ్చిన 200 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్న ఈ ఎన్నికల్లో, కరకగూడెం గ్రామానికి చెందిన సిరిశెట్టి కమలాకర్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో
నేషనల్ జాయింట్ సెక్రటరీ రాందాస్,
జోనల్ సెక్రటరీ గుమ్మడవెల్లి శ్రీనివాస్,
నేషనల్ ఈసీ మెంబర్ చందా మధు,
రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండలు,
జిల్లా అధ్యక్షులు వెల్లు సోమిరెడ్డి,
జిల్లా ఉపాధ్యక్షులు సోయం శ్రీను,
తోపాటు గుమ్మడవెల్లి కృష్ణ, నందిగామ ప్రసాదు, సలగు బిక్షపతి, మిట్టపల్లి శంకరయ్య, మండల ఉపాధ్యక్షులు బిర్ర విష్ణు, విష్ణు, గోగు వెంకట్, దొంతు వెంకన్న, ఆకుల నాగరాజు, కొడెమ్ మధు, పడిగ సమ్మయ్య, గందర్ల సతీష్ తదితర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన కమలాకర్ మాట్లాడుతూ, అయ్యప్ప సేవా కార్యక్రమాలను మండలంలో మరింత విస్తరించి, సేవా కార్యక్రమాల ద్వారా అయ్యప్ప భావజాలాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.









