భద్రాద్రి జిల్లాకు కొత్త డీఎంహెచ్‌ఓగా డాక్టర్ రాథోడ్ తుకారాం బాధ్యతలు స్వీకరణ.
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కొత్త డీఎంహెచ్‌ఓగా డాక్టర్ రాథోడ్ తుకారాం గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఆరోగ్య సేవల బలోపేతంపై ఇద్దరూ చర్చించారు. ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలులో మరింత సమన్వయం సాధించడం ప్రధాన లక్ష్యమని డాక్టర్ తుకారాం పేర్కొన్నారు.
కొత్త డీఎంహెచ్ఓ బాధ్యతలు స్వీకరించడంతో వైద్య, ఆరోగ్య విభాగం అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 62









