టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మోనాలిసా గ్రాండ్ ఎంట్రీ!
వైరల్ స్టార్‌కు వరుస అవకాశాలు
సినిమా,ఆధాబ్ న్యూస్:
మహా కుంభమేళాలో రుద్రాక్షల పూసలు అమ్ముతూ ఉన్న వీడియోతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే అదృష్టం ఒక్కరోజులో మారిపోయింది. రుద్రాక్షలు అమ్మే అమ్మాయి నుంచి హీరోయిన్ స్థాయికు ఎదిగిన ఆమె కథ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వైరల్ వీడియో చూసిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, తన కొత్త చిత్రం *‘ది డైరీ ఆఫ్ మణిపూర్’*లో నటించే అవకాశం మోనాలిసాకు ఇచ్చాడు. ఇక తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి, మోనాలిసా త్వరలో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వెల్లడించారు.
అదే కాదు… మోనాలిసా మలయాళ సినిమా పరిశ్రమలో కూడా అవకాశం పొందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ స్టార్స్‌లో హీరోయిన్‌గా ఎదుగుతున్న అరుదైన ప్రయాణంగా మోనాలిసా కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
రుద్రాక్షల అమ్మకాలు నుంచి రజతరంగం వరకూ… మోనాలిసా జర్నీ ప్రస్తుతం నెట్లో ట్రెండ్ అవుతోంది.









