ప్రతి క్షణం
ప్రజల పక్షం

  చట్నీ వివాదం.. ప్రాణం తీసిన క్రూరత్వం

చట్నీ వివాదం.. ప్రాణం తీసిన క్రూరత్వం

హైదరాబాద్‌,ఆధాబ్ న్యూస్:
అనుకోకుండా చట్నీ పడిందనే చిన్న సంఘటన ప్రాణాంతక దాడికి దారి తీసింది. నాచారం–ఎల్బీనగర్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలో మురళీకృష్ణ (45) అనే వ్యక్తిని నాలుగు యువకులు (ఒక మైనర్‌ సహా) దారుణంగా హతమార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

మూలాలకు సమాచారం ఇలా ఉంది:

అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎల్బీనగర్ సమీపంలో లిఫ్ట్ కోరిన మురళీకృష్ణను కారులో తీసుకెళ్లిన యువకులు–

మహమ్మద్ జునైద్ (18)

షేక్ సైఫుద్దీన్ (18)

మణికంఠ (21)

ఒక మైనర్ బాలుడు (16)

కారులో ఎన్జీఆర్ఐ ప్రాంతంలో అందరూ కలిసి టిఫిన్ చేస్తుండగా, మురళీకృష్ణ పొరపాటున ఒక యువకుడిపై చట్నీ పడింది. దీనికి అతను క్షమాపణ చెప్పినా, యువకులు ఆగ్రహించి అతణ్ని బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు.

ఇంకా రెండు గంటల పాటు కారులో తిప్పుతూ, దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం కత్తితో దాడి జరగగా, తప్పించుకునేందుకు కారు నుంచి దూకి పరారయ్యే ప్రయత్నం చేసిన మురళీకృష్ణను యువకులు వెంబడించి చంపేశారు. మరణం నిర్ధారించుకున్న తర్వాత కత్తిని మార్గమధ్యలో పడేసి, కారు పార్క్ చేసి అక్కడి నుంచి పారిపోయారు.

ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!