అయ్యప్ప భక్తులకు మహా అన్నదానం.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారణ అనంతరం దేవదేవుని దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నారాములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన సేవాభావి యువకులు ఆకుల మౌనిక్, పవన్. వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా మహా అన్నదానం ఘనంగా నిర్వహించారు.
కరకగూడెం మండలం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో కొలువైన సమ్మక్క–సారలమ్మ గట్టు జాతర వద్ద ఏర్పాటుచేసిన ఈ మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 120 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు, స్వాములు భక్తిపూర్వకంగా ప్రసాదం స్వీకరించారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్న మౌనిక్, పవన్ నిర్విరామ సేవను స్థానికులు అభినందిస్తున్నారు. భక్తులకు భోజనం మాత్రమే కాదు, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ సేవా వృత్తిని కొనసాగిస్తున్నారని భక్తులు ప్రశంసిస్తున్నారు.
భక్తులకు సేవ చేయడం గొప్ప పుణ్యమని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సేవాదారులు తెలిపారు.









