ప్రతి క్షణం
ప్రజల పక్షం

  స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఈ నెల 24లోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలి

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ నెల 24లోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలి

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 24వ తేదీ లోపు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు ముఖ్య వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లపై మాత్రమే స్టే ఉన్నదన్న కారణంతో, మొత్తం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అడ్డంకి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

విచారణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వం రెండు వారాల గడువు ఇస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను 24వ తేదీ లోపు వెల్లడించాల్సిందిగా స్పష్టం చేసింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్