తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..!
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు (సోమవారం) మరియు రేపు (మంగళవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
వడ్లు ఆరబోసిన రైతులు, పంటలు కోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు. వర్షాల ప్రభావంతో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Post Views: 26









