ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి – రేగా కాంతారావు హెచ్చరిక

జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి – రేగా కాంతారావు హెచ్చరిక
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం,జిల్లా బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నవంబర్ 7న జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి చేపడతామని ఆయన ప్రకటించారు. “పోలీస్‌, న్యాయవ్యవస్థలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. దాడులకు దిగే కక్ష సాధింపు మాకు అవసరం లేదు. భయపెట్టే ప్రయత్నాలు చేసేవారిని కాలమే నిర్ణయిస్తుంది. మేము భయపడేవాళ్లం కాదు” అని రేగా స్పష్టం చేశారు.

ఇటీవలి దాడుల నేపథ్యంలో బీఆర్‌ఎస్ కార్యాలయాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలంతా శాంతియుతంగా కానీ ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. “జనవిజ్ఞానాన్ని అణచివేయాలనే ప్రయత్నాలకు మేము తలొగ్గం. ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం” అని అన్నారు.

జిల్లా కేంద్రాలు, మండలాల వారీగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ప్రారంభించాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!