ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎంత సాహసం.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..!

ఎంత సాహసం.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..!
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అసాధారణమైన సాహసాన్ని ప్రదర్శించారు. కరకగూడెం మండలం నుండి వీరాపురం క్రాస్ రోడ్ నుండి బయలుదేరి, రేగళ్ళ – మర్కొడు – ఆళ్లపల్లి మార్గం గుండా కొత్తగూడెం వరకు స్వయంగా ప్రయాణం చేశారు.

ఈ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్ స్వయంగా ఈ కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

ప్రజల్లో కలెక్టర్ సార్ ఈ నిర్ణయం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!