కరకగూడెంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
కరకగూడెం ఆధాబ్ న్యూస్: మండలంలోని చిరుమల గ్రామంలో అక్రమంగా రవాణా అవుతున్న 20 కింటల పిడిఎస్ (రేషన్) బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఎస్సై నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన దాడిలో ఈ పట్టివేత చోటుచేసుకుంది.
సివిల్ సప్లై అధికారి శివకుమార్ మాట్లాడుతూ — చిరుమల గ్రామం పరిసరాల్లో రేషన్ బియ్యం పౌల్ట్రీ ఫారానికి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించామని, ట్రాక్టర్‌లో తరలిస్తున్న 20 కింటల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు..
Post Views: 50









