ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరులో 3.5 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురిపై కేసు నమోదు

మణుగూరులో 3.5 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురిపై కేసు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్:
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న “చైతన్య – డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమం ఫలితంగా ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ప్రజల సమాచారంతో మణుగూరు పోలీస్‌లు మరో గంజాయి కేసును ఛేదించారు.

మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నివసించే చల్లా శ్రీనివాస్ (S/o నరసయ్య) ఇంట్లో గంజాయి నిల్వ ఉందని అందిన సమాచారం మేరకు పోలీసులు సోదా చేశారు. డీఎస్పీ ఆదేశాలపై, గవర్నమెంట్ పంచుల సమక్షంలో నిర్వహించిన సోదాలో 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, తన అన్నకొడుకు చల్లా సతీష్ మరియు అతని స్నేహితుడు రేపాకుల సాగర్ కలిసి సీలేరు ప్రాంతం నుండి గంజాయి తెచ్చి అమ్ముతుంటారని, తాను కూడా ఆ ఉద్దేశ్యంతో నిల్వ ఉంచినట్లు వెల్లడించాడు.

ఈ వివరాల ఆధారంగా మణుగూరు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. చల్లా శ్రీనివాస్‌ను రిమాండ్‌కు పంపగా, చల్లా సతీష్ మరియు రేపాకుల సాగర్‌లను ఇప్పటికే ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!