రఘునాథగూడెంలో వరి పంటలకు నీటిముప్పు – 12 ఎకరాలు మునిగిపోయి రైతుల ఆవేదన
ఖమ్మం,ఆధాబ్ న్యూస్:
కల్లూరు మండలంలోని రఘునాథగూడెంలో భారీ వర్షాల ప్రభావంతో మోకాళ్ల లోతు నీటిలో 12 ఎకరాల వరి పంట పూర్తిగా మునిగిపోయింది. చేతికొచ్చిన పంట నీటిపాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 130









