భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
మొoథా తూఫాను ప్రభావంతో జిల్లాలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, నేడు (బుధవారం) జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో నెలకొన్న తుఫాను మరియు భారీ వర్షాల పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
DEO, భద్రాద్రి కొత్తగూడెం
Post Views: 39









