డ్రగ్స్‌పై ఎలాంటి రాజీ లేదు — కేసుల విచారణలో జాప్యం చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్,న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి కేసులో ఉన్నతమైన దర్యాప్తు జరిపి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని, విచారణలో జాప్యానికి పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిషేధిత గంజాయి రవాణాపై మాత్రమే కాకుండా, గంజాయి సేవించే వారిపైనా కేసులు నమోదు చేయాలని చెప్పారు. “చైతన్యం – డ్రగ్స్‌పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా, జిల్లాలో హాట్‌స్పాట్స్‌ను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
రోడ్లపై పెట్రోలింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, సాంకేతిక పరిజ్ఞానంతో దొంగతనాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, ట్రాఫిక్ నియమాల పర్యవేక్షణ వంటి విషయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఇతర సీఐలు, ఎస్సైలున్నారు.









