సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ చేసిన మంత్రి సీతక్క
ములుగు/తాడ్వాయి, ఆధాబ్ న్యూస్:
మేడారం జాతర సందర్భంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, డిసెంబర్ నెలలోనే పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ దేవాలయ విస్తరణ, మౌలిక వసతుల పనులను మంత్రివర్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం గేట్ పిల్లర్ల ఏర్పాటు, స్టీల్–సిమెంట్ నాణ్యతను కచ్చితంగా పాటించాలని ఆమె సూచించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ములుగు ఎస్పీ డా. శబరిష్, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్, అదనపు కలెక్టర్ సివిల్ సప్లై సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, డీఎస్పీ రవీందర్, తహశీల్దార్ సురేష్‌బాబు తో పాటు ఆర్‌అండ్‌బి, ఎండోమెంట్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, పూజారి సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.









