ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ గ్రామ పరిపాలనాధికారి ఎసీబీకి పట్టుబాటు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతింపై ఎసీబీ దాడులు జరిపింది. గ్రామ పరిపాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఎసీబీ అధికారులకు చిక్కాడు.
పూసుగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పనికి సంబంధించి మొత్తం రూ.60,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. అందులో తొలి విడతగా రూ.40,000 తీసుకున్నాడు. శుక్రవారం మరో రూ.15,000 డబ్బులు స్వీకరిస్తుండగా ఎసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలోని బృందం పట్టివేసింది.
దీనిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు ఎసీబీ అధికారులు వెల్లడించారు.
Post Views: 49









