డ్రగ్స్‌పై యుద్ధం – విద్యార్థుల్లో అవగాహన
పినపాక, ఆధాబ్ న్యూస్:
మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టే దిశగా పోలీసులు “డ్రగ్స్‌పై యుద్ధం” పేరుతో విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పినపాక శ్రీవిద్య కాలేజీలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడుతూ — “డ్రగ్స్ మన జీవితాలను నాశనం చేస్తాయి. ఒకసారి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టం. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తు నిర్మాణంపై దృష్టిపెట్టాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేష్ కూడా పాల్గొన్నారు. విద్యార్థులు డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రశ్నలు అడిగి అవగాహన పొందారు.
డీఎస్పీ మాట్లాడుతూ, “పోలీసులు మాత్రమే కాదు, ప్రతి పౌరుడు డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామి కావాలి” అని పిలుపునిచ్చారు.









