త్యాగాలు మరువలేనివి
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అమరవీరుల దినోత్సవ వేడుకలను పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ — ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని తెలిపారు.
వారి ధైర్యసాహసాలు ప్రతి పోలీస్ సిబ్బందికి ప్రేరణగా నిలుస్తాయని, వారి స్ఫూర్తితో సేవా దృక్పథంతో ముందుకు సాగాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 46









