ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బయ్యారం-తాడ్వాయి ప్రధాన రహదారి పరిస్థితి ప్రజలకు ముప్పుగా మారింది

బయ్యారం-తాడ్వాయి ప్రధాన రహదారి పరిస్థితి ప్రజలకు ముప్పుగా మారింది

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్ : కరకగూడెం మండలం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు సిద్ధి సునీల్ ఆధ్వర్యంలో మంగళవారం బయ్యారం-తాడ్వాయి ప్రధాన రహదారి పరిస్థితి పై “గుంతల సెల్ఫీ” డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు గుంతల సెల్ఫీ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో తోలెం రామారావు, ఈసం రాజబాబు, గుర్రం లాలయ్య, ఈసం రాజు, కోరగొట్ల చంద్రశేఖర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. స్థానికులు, ద్విచక్ర వాహనదారులు కిందపడి ప్రాణాపాయం ఎదుర్కొనే పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అని ఆయన తెలిపారు

కరకగూడెం మండలం లోని  పద్మాపురం ప్రాంతంలో రహదారి పరిస్థితి పట్టించుకోని ప్రభుత్వం వల్ల ఇది ప్రమాదకర స్థితికి చేరింది. తక్షణమే సంబంధిత R&B అధికారులు రహదారిని మరమ్మత్తు చేసి ప్రజల భద్రతను కాపాడాలి” అని డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యంగా చేపట్టబడింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!