కరకగూడెంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని
ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పోలీస్ అమరవీరులకు జేఏసీ సభ్యులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ – “ప్రజాస్వామ్య రక్షణే మా పరమావధి. సమాజ శ్రేయస్సు కోసం కర్తవ్యదీక్షతో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. శాంతి భద్రతల కాపాడటంలో వారి పాత్ర చిరస్మరణీయమైంది” అని తెలిపారు.
పోలీస్ అమరవీరుల సేవలు సమాజానికి ఆదర్శమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోరాదని ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని అమరులకు పుష్పాంజలులు ఘటించి నివాళులర్పించారు.









