ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం పీహెచ్‌సీని పరిశీలించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య ప్రసూతి సేవలను మెరుగుపరచాలని వైద్య సిబ్బందికి సూచనలు

కరకగూడెం పీహెచ్‌సీని పరిశీలించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య

ప్రసూతి సేవలను మెరుగుపరచాలని వైద్య సిబ్బందికి సూచనలు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య గురువారం కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
రోగుల ఆరోగ్య రికార్డులు, రక్తపరీక్షలు, మందుల నిల్వలు, ప్రసూతి సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలను మరింత మెరుగుపరచాలి. సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. రికార్డులను సమయానుకూలంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి,” అని సూచించారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరిస్తూ, గ్రామాల్లో తరచూ వైద్య శిబిరాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ శ్రీనివాస్, హెచ్ఈఓ గొంది వెంకటేశ్వర్లు, హెచ్ఈఓ కృష్ణయ్య, పీహెచ్‌సీ వైద్యుడు రవితేజ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!