పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి
నెలరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం
గ్రేటర్ నోయిడా, ఆధాబ్ న్యూస్:
రైల్వే పట్టాలు దాటే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే — తుషార్ అనే యువకుడు బోడాకి రైల్వే క్రాసింగ్ వద్ద బైక్‌పై వేగంగా వెళ్తూ రైలు రాకముందే పట్టాలు దాటాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ జారి కిందపడ్డాడు. అదే సమయంలో రైలు వేగంగా దూసుకొచ్చింది. కంగారుపడి పక్కకు తప్పుకోకుండా ముందుకు కదిలిన తుషార్‌ను రైలు ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. నెలరోజుల్లో తుషార్ వివాహం జరగాల్సి ఉండగా, ఈ అనర్థం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
Post Views: 40









