ఖమ్మం మమత సెంటర్‌లో మారణాయుధాలతో దాడి — టాస్క్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పిన వ్యక్తి
ఖమ్మం,ఆధాబ్ న్యూస్:
ఖమ్మం నగరంలోని మమత సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు మారణాయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ సతీష్ మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వేగంగా స్పందించి ఒక వ్యక్తిని ప్రాణాపాయం నుంచి రక్షించారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అసాంఘిక శక్తులకు తావు లేకుండా రోజువారీగా పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్న కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారు. సంఘటన చోటుచేసుకున్న క్షణాల్లోనే పోలీస్ బృందాలు అక్కడికి చేరుకొని దాడి చేసిన వారిని చెదరగొట్టాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Post Views: 32









