విజయ్ బ్లడ్ బ్యాంక్ వేల్పర్ అసోసియేషన్‌లో మెంతిని సాగర్‌కు కీలక బాధ్యత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లీడింగ్ ఇంచార్జ్‌గా నియామకం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం మోతె గ్రామానికి చెందిన మెంతిని సాగర్ సామాజిక సేవలో చూపిన కృషి, మానవతా సేవా మనోభావం ఫలించి కొత్త గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ బ్లడ్ బ్యాంక్ వేల్పర్ అసోసియేషన్ సంస్థలో పినపాక బ్రాంచ్ ఇంచార్జ్‌గా పనిచేస్తూ ఎవరికి రక్తం అవసరమైందని తెలిసినా ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకు వచ్చి సహాయం చేస్తూ అనేక ప్రాణాలను కాపాడాడు.
ఆయన సేవలను గుర్తించిన సంస్థ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు వి.వి. విజయ్, సెక్రటరీ యోగి కలిసి మెంతిని సాగర్‌ను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీడింగ్ ఇంచార్జ్‌గా నియమించారు.
ఈ అవకాశాన్ని ఇవ్వడం పట్ల సాగర్ విజయ్ బ్లడ్ బ్యాంక్ వేల్పర్ అసోసియేషన్ సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఆయన సేవాభావం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.









