బావిలో పడిన ఇద్దరు చిన్నారుల మృతి – విషాదంలో ఎంచగూడెం గ్రామం
మహబూబాబాద్,ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో దసరా పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. పండగ సందర్భంగా తాతయ్య, అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు అనుకోకుండా వ్యవసాయ బావిలో పడిపోయిన ఘటన గ్రామాన్ని షాక్‌కు గురి చేసింది.
బావి వద్ద చిన్నారుల బట్టలు కనిపించడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేసి బావిలో వెతికారు. అనంతరం ఒక చిన్నారి మృతదేహం బయటపడగా, మరో చిన్నారి కోసం శోధన కొనసాగుతోంది.
తాత సారయ్య చెల్లెలు మృతిచెందడంతో కుటుంబం అంతా గ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న ఎస్సై రాజ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Post Views: 67









