మానవత్వమే ఆయన మతం — ఆపదలో ఎవరున్నా ఒక క్షణం కూడా ఆలోచించడు!
సహాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి — ఆ ఎస్ఐ ఎవరో తెలుసా? ఇమ్మిడి రాజ్ కుమార్!
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. ఆయన వెనుక భార్యతో పాటు ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉండడంతో
ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఇమ్మిడి రాజ్ కుమార్, మానవత్వంతో మృతుడి కుటుంబానికి ₹5000 నగదు ఆర్థిక సహాయం అందించారు.
గతంలో పినపాక మండలంలోని బయ్యారం లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సమయంలోనూ రాజ్ కుమార్ పేదవారికి అండగా నిలిచిన మంచి హృదయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి చేయూత ఇవ్వడం, యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్లు అందించి క్రీడాప్రోత్సాహం కల్పించడం, సన్మార్గంలో నడిపించడం ఆయనకు అలవాటు.
తాటిగూడెం గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు ఎస్ఐ రాజ్ కుమార్ మానవత్వాన్ని అభినందిస్తూ,
“ఇలాంటి మంచి మనసున్న అధికారులు మన సమాజంలో ఉంటేనే ప్రజలకు ధైర్యం, నమ్మకం కలుగుతుంది” అంటూ ప్రశంసించారు.









