ముగ్గురు ఆడపిల్లలున్న కుటుంబానికి మానవత్వంతో సహాయం చేసిన ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో మానవత్వాన్ని చాటిన అటవీశాఖ మహిళా అధికారిణి ఏడూళ్ల బయ్యారం రేంజ్ ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వి ఆదర్శంగా నిలిచారు.
స్థానిక వ్యక్తి కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో గత 25 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి హైదరాబాద్‌లో మరణించారు. ఆయనకు ముగ్గురు చిన్న ఆడపిల్లలే ఉన్నారని తెలుసుకున్న తేజస్వి మేడం మనసు కదిలింది. ఆ కుటుంబానికి తన వంతు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో రూ.5,000లను తన సహాయకుడి ద్వారా అందజేశారు.
తన వృత్తి కర్తవ్యంతోపాటు మానవత్వాన్ని చూపించిన తేజస్వి, “ఆడపిల్ల ఎప్పుడూ తల్లిదండ్రులకు భారం కాదు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్ల కూడా కుటుంబానికి గర్వకారణమే” అని పేర్కొన్నారు.
తేజస్వి మేడం వ్యక్తిగతంగా ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చగా, గ్రామ పెద్దలు పోలె బోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు తదితరులు సహాయం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామ పెద్దలు, బంధువులు తేజస్వి మేడం చూపిన మానవతా హృదయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.









