ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సజావుగా నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటన

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సజావుగా నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటన

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగబోయే జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు వివిధ విభాగాల నోడల్ అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలో సమన్వయంతో పనిచేసి, విధి నిర్వహణలో ఎటువంటి లోపం చోటు చేసుకోకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలనతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు.

జిల్లా స్థాయిలో వివిధ ఎన్నికల కార్యకలాపాలకు క్రింది అధికారులు నోడల్ అధికారులుగా నియమితులయ్యారు:

మానవ వనరుల నిర్వహణ (Man Power Management) – బి. నాగలక్ష్మి, జిల్లా విద్యా అధికారి

బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణ (Ballot Box Management) – జె. నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి

రవాణా నిర్వహణ (Transport Management) – వెంకట రమణ, జిల్లా రవాణా అధికారి

శిక్షణ కార్యక్రమాల నిర్వహణ (Training Management) – కె. శ్రీరామ్, జిల్లా ఉపాధి అధికారి; సాయి కృష్ణ, సబ్జెక్ట్ అసిస్టెంట్, విద్యాశాఖ

సామగ్రి నిర్వహణ (Material Management) – జి. దినేశ్ కుమార్, సహాయ సంచాలకుడు (మైన్స్ & జియాలజీ); వై.టి.టి.వి. రమణ రావు, అకౌంట్స్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం

ఎంసీసీ మరియు ఎన్నికల వ్యయ పర్యవేక్షణ (Model Code & Expenditure Monitoring) – ఎం. విద్యా చందన, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

వ్యయ గణాంకాల సేకరణ – కె. సంజీవరావు, జిల్లా ప్రణాళిక అధికారి

అభ్యర్థుల ఖర్చు లెక్కల పర్యవేక్షణ – జి. శ్రీనివాస్, జిల్లా ఆడిట్ అధికారి

ఫ్లయింగ్ స్క్వాడ్‌లు & డేటా పర్యవేక్షణ – మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల జనరల్ మేనేజర్

మోడల్ కోడ్ ఉల్లంఘన కేసుల పరిశీలన – ఎం. శ్రీనివాస్ చౌదరి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్, స్పెషల్ బ్రాంచ్

చట్టపరమైన కేసుల నమోదు & చర్యలు – చి. శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్, స్పెషల్ బ్రాంచ్

ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి – ఎ. శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి

ఆబ్జర్వర్ల సమన్వయం (Observer Coordination) – ఎస్. త్రినాథ్ బాబు, జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్

బ్యాలెట్ పేపర్ & పోస్టల్ బ్యాలెట్ పంపిణీ (Printing & Distribution) – వి. బాబు రావు, జిల్లా వ్యవసాయ అధికారి

మీడియా కమ్యూనికేషన్ (Media Communication) – మొహమ్మద్ అజ్గర్ హుస్సేన్, జిల్లా పౌర సంబంధాల అధికారి

హెల్ప్‌లైన్ & ఫిర్యాదుల పరిష్కారం (Helpline & Complaint Redressal) – శ్రీరామ్ సుశీల్ కుమార్, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి

రిపోర్టులు & నివేదికలు (Reports & Returns) – బి. నాగలక్ష్మి, సీఈఓ, జిల్లా పరిషత్; కె. చంద్రశేఖర్, ఉప సీఈఓ, జిల్లా పరిషత్

వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ (Web Casting) – జె. సైదేశ్వర రావు, ఈ-డీఎం, భద్రాద్రి కొత్తగూడెం; హెచ్. వెంకటేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి

ప్రజాస్వామ్య ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!