ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం జనగామ జిల్లా తాటికొండలో విషాదం

గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
జనగామ జిల్లా తాటికొండలో విషాదం

జనగామ,ఆధాబ్ న్యూస్: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు మారపాక అన్వేష్ (26) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రియురాలు గడ్డం పావని (22) ప్రస్తుతం హనుమకొండ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!