కోల్డ్రిఫ్ సిరప్ వాడకం నిలిపేయాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 5 (ఆధాబ్ న్యూస్):
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పిల్లల మరణాలకు కారణమైన ‘కోల్డ్రిఫ్ సిరప్’ (Coldrif Syrup) వాడకం నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.
సెరసన్ ఫార్మా (Sresan Pharma), కన్యాకుమారి జిల్లా (తమిళనాడు)లో తయారు చేసిన బ్యాచ్ నంబర్ SR-13, మే-2025లో తయారై ఏప్రిల్-2027లో గడువు ముగియనున్న కోల్డ్రిఫ్ సిరప్‌లో విషపదార్థమైన డైఎథిలిన్ గ్లైకాల్ (Diethylene Glycol – DEG) కలిసినట్టు గుర్తించినట్లు అధికారుల ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఆ సిరప్ ఉన్నట్లయితే వెంటనే వాడకం నిలిపి, సమీప డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు అప్పగించాలని సూచించారు. సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969ను ఏర్పాటు చేశారు. ఈ నంబర్ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు మార్కెట్లో ఉన్న ఆ బ్యాచ్ సిరప్ స్టాక్‌లను నిలిపివేయాలని ఆదేశించారు. తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో కలిసి ఆ ఉత్పత్తి పంపిణీపై నిఘా పెట్టినట్లు తెలిపారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిల్లల ఆరోగ్య భద్రత కోసం సూచనలను పాటించాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షహ్నవాజ్ ఖాసీమ్, IPS తెలిపారు.









