విపిఎల్-5 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ రసవత్తరంగా
తాడ్వాయి,
ఆధాబ్ న్యూస్:
తాడ్వాయి మండలంలోని రంగాపురం స్కూల్ మైదానంలో దసరా పండుగ సందర్భంగా జరుగుతున్న విపిఎల్-5 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
శుక్రవారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లలో కొత్తూరు కింగ్స్ సన్‌రైజర్స్ జట్టును, ఫ్రెండ్స్ టీమ్ కళ్యాణ్ జట్టును ఓడించి సెమీఫైనల్‌కు చేరాయి.
ఈ మ్యాచ్‌లలో అద్భుత ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు అంజలి కిడ్నీ కేర్ & రిసెర్చ్ సెంటర్ తరఫున మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు టోర్నమెంట్ నిర్వాహకులు రంజిత్, ప్రసాద్, రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.
స్థానిక క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఆటలను ఆస్వాదించారు.
Post Views: 172









