ప్రతి క్షణం
ప్రజల పక్షం

  క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి : డిప్యూటీ డిఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్

క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలి : డిప్యూటీ డిఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్

తాడ్వాయి, సెప్టెంబర్ 28: ఆధాబ్ న్యూస్:
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలని ఏటూరునాగారం ఐటిడిఎ డిప్యూటీ డిఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్ ఆకాంక్షించారు.

ఆదివారం మండలంలోని రంగాపురం జెడ్పీ హైస్కూల్ మైదానంలో విపిఎల్-5 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌లో కరకగూడెం, పినపాక, మణుగూరు, ఆళ్లపల్లి, గుండాల, తాడ్వాయి మండలాలకు చెందిన ఏడు జట్లు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ, “ఏజెన్సీ ప్రాంతంలో అణిముత్యం లాంటి క్రీడాకారులు ఉన్నారు. గ్రామాల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలంటే ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు నిర్వహించడం అవసరం. ఐపీఎల్ తరహాలో పట్టణాల్లో జరిగే ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్‌ను గ్రామీణ ప్రాంతంలో నిర్వహించడం అభినందనీయం” అని పేర్కొన్నారు.

ప్రారంభ మ్యాచ్‌లో కళ్యాణ్-11 విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో సీఎస్కే-11 ప్రాంచెస్ జట్టు గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఆటగాళ్లు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఇర్ప సూర్యం, చెన్నూరు శేషుబాబు, గుమ్మడి ముత్తయ్య, దాసరి శివానందు, రామనాథం, వెంకన్న, స్వామి పాల్గొన్నారు. టోర్నీ నిర్వాహకులు రంజిత్, సుధాకర్, గోపి, శివ, రామకృష్ణ తదితరులు విజయవంతంగా నిర్వహించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!