ఛత్తీస్గఢ్లో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు
దంతెవాడ,ఆధాబ్ న్యూస్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. మొత్తం 71 మంది మావోయిస్టులు దంతెవాడ జిల్లాలో అధికారుల ఎదుట లొంగుబాటు చేశారు. వీరిలో 30 మందిపై కలిపి సుమారు ₹64 లక్షల బహుమతి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
లొంగిపోయిన వారిలో పలువురు కీలక దళ నాయకులు కూడా ఉన్నారని సమాచారం. ప్రభుత్వ పునరావాస పథకంలో భాగంగా వీరందరికీ అవసరమైన సాయం, సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
Post Views: 72









