ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఫోటో & వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున మరణించిన సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఫోటో & వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున మరణించిన సభ్యుల కుటుంబాలకు ఆర్థిక సాయం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
పినపాక, కరకగూడెం మండలం:
ప్రతి సంవత్సరం లాగానే, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ , శక్తి డిజిప్రెస్ అధినేత మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన ఆరుగురు ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రూ.30 వేల రూపాయల చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, పినపాక–కరకగూడెం మండలానికి చెందిన అసోసియేషన్ సభ్యుడు ముంజాల ప్రవీణ్ కుమార్ గౌడ్ అకాల మరణం కారణంగా ఆయన కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు చేసిన సహకారానికి పినపాక–కరకగూడెం మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!