ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నెల్లిపాకలో NREGA మునగ తోటను పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అధికారులు

నెల్లిపాకలో NREGA మునగ తోటను పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అధికారులు
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండలంలోని నెల్లిపాక పంచాయితీ, నెల్లిపాక గ్రామంలో రైతు ముండ్రు నాగసుధీర్‌కు NREGA పథకం ద్వారా ఏర్పాటు చేసిన మునగ తోటను అధికారులు శనివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో EOSSRD ఎల్‌.వి. సుబ్బారావు (రిటైర్డ్‌ IAS), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, DRDO విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ తృనాల్ శ్రేష్ట్ర, అశ్వాపురం ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్, ఎంపీవో ముత్యాలరావు, ఏపివో సీతారామయ్య, నెల్లిపాక సెక్రటరీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అలాగే, రైతులు విరమచినేని రాజశేఖర్, ముండ్రు రామకృష్ణతో పాటు పలువురు స్థానికులు హాజరై అధికారులు చేపట్టిన పర్యటనలో భాగమయ్యారు. అధికారులు మునగ తోట నిర్వహణ, పంట పెంపకం పద్ధతులను పరిశీలించి రైతులకు సూచనలు అందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!