ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మద్యం విక్రయాలు తప్పనిసరిగా MRP ధరలకే జరగాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య

మద్యం విక్రయాలు తప్పనిసరిగా MRP ధరలకే జరగాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య

కరకగూడెం, ఆధాబ్ న్యూస్: మద్యం షాపులు ఎమ్మార్పీ ధరలకు విరుద్ధంగా అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నందుకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“బెల్ట్ షాపులకు అధిక రేట్లకు సరఫరా చేసి, అక్కడినుంచి సాధారణ ప్రజలకు మరింత ఎక్కువ ధరలకు అమ్మడం అన్యాయం. మద్యం తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
అని అన్నారు.
ఈ సమావేశంలో అక్కిరెడ్డి వెంకటరెడ్డి, కొమరం రాంబాబు, పోగు వెంకటేశ్వర్లు, రేగా సత్యనారాయణ, కొంపల్లి చిన్న రామలింగం, పాయాం నరసింహారావు, కట్టుకోజుల వేణు, చిట్టి మల్ల ప్రవీణ్, గంధర్ల సతీష్, నిట్ట ప్రభాకర్, ఎలాగొండ శ్రీనివాస్, బంధు సతీష్, ఊకె నరేష్, పోలె బోయిన శేఖర్, రావుల సమ్మయ్య, కల్లూరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!