దసరా సెలవుల్లో తరగతులు వద్దని ప్రభుత్వం హెచ్చరిక
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. విద్యార్థులకు రివిజన్ కోసం అవసరమైనంత హోమ్ వర్క్ ఇవ్వవచ్చని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది.
Post Views: 45









