ఒడిశాలో దారుణ ఘటన – హాస్టల్లో 8 మంది విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్
ఒడిశా,ఆధాబ్ న్యూస్:
ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా సలాగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఒక తొటి విద్యార్థి ఫెవిక్విక్ (Feviquick) వేసాడు.
తీవ్ర నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కళ్లను తెరవలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 66









