ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై సురేష్

వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై సురేష్
పినపాక,ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో ఏడూల్ల బయ్యారం ఎస్‌ఐ సురేష్ గురువారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, సరైన పత్రాలు లేని వాహనదారులపై జరిమానాలు విధించారు.

వాహనదారులకు సూచనలు చేస్తూ ఎస్‌ఐ సురేష్, మద్యం సేవించి వాహనం నడపరాదని, అలాంటి నిర్లక్ష్యం కుటుంబాలకు దూరం చేసే ప్రమాదముందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిపుల్ రైడ్ చేయరాదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!